అప్పుడైతే సానుభూతి దొరుకుతుంది టిజి
Published on: Wed Jan 4, 2012 1:52PM
హైదరా
బాద్: కెసిఆర్ ప్రస్తుతం నిరాహార దీక్షలు మానుకోవాలని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ సూచించారు. బంజారాహిల్స్‌లో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతగా దీక్ష చేయాలనుకుంటే 2013లో చేయాలని, అప్పుడైతే వచ్చే ఎన్నికల వరకు ఆయనకు సానుభూతి దొరుకుతుందని ఎద్దేవా చేశారు. బక్క చిక్కి ఉన్న ఆయన దీక్ష చేయలేరని, చేసినా రెండో రోజు చికిత్స కోసం హాస్పిటల్ తీసుకెళతారన్నారు. ప్రళయం వచ్చే పరిస్థితి ఉంటే మాత్రం ఎవరూ బతికి ఉండరన్నారు.


