TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎల్లో జర్నలిజం అంటే ఆంధ్రజ్యోతి :కెటిఆర్

Published on: Sat Dec 31, 2011 4:14PM

హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుది విజయనగరం జిల్లా అంటూ పతాక శీర్షకన రాసిన ఆంధ్రజ్యోతి దినపత్రికపై తెలంగాణ రాష్ట్ర సమితి  శాసనసభ్యుడు కెటి రామారావు నిప్పులు చెరిగారు.దమ్ముంటే ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ కరీంనగర్ జిల్లా మోహినిగుట్టకు రావాలని, కెసిఆర్‌కు సంబంధించిన ఏడు తరాలవారిని చూపిస్తామని ఆయన  మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఆంధ్రజ్యోతిపై తాము కోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు. ఎల్లో జర్నలిజం అంటే ఏమిటో ఆంధ్రజ్యోతి నిరూపించిందని ఆయన వ్యాఖ్యానించారు.ఎవరో చెప్తే కనీసం వివరణ కూడా తీసుకోకుండా ఆంధ్రజ్యోతి వార్తాకథనాన్ని ప్రచురించడం సరి కాదని ఆయన అన్నారు.

ఉద్యమం తగ్గుముఖం పట్టిందని భావించి ఏది పడితే అది మాట్లాడుతూ ఉద్యమ నాయకులకు వ్యతిరేకంగా పనిచేసే సీమాంధ్ర జ్యోతులకు, సీమాంధ్ర పెద్దలకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.ఆంధ్రజ్యోతిని సీమాంధ్ర జ్యోతిగా అభవర్ణించారు. ఓ పార్టీ పట్ల ప్రేమ ఉంటే, ఆ పార్టీ నాయకుడిని కాపాడుకోవాలనుకుంటే రాధాకృష్ణ కాపాడుకోవచ్చునని, కానీ ఇతరులను దుమ్మెత్తిపోయడం సరి కాదని ఆయన అన్నారు.  ప్రజల పట్ల విషపుత్రిక అని ఆయన ఆంధ్రజ్యోతిని అభివర్ణించారు. పత్రికను అడ్డు పెట్టుకుని ఏది పడితే అది మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. ఆంధ్రజ్యోతి తన బుద్ధిని, నైజాన్ని, నైచ్యాన్ని బయట పెట్టుకుందని ఆయన అన్నారు.