TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ తాతల ఊరు చూపించిన తెలుగుదేశం

Published on: Sat Dec 31, 2011 10:08AM

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం వేర్పాటు ఉద్యమం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు ముమ్మాటికీ విజయనగరం వాసేనని ఆ జిల్లాకు చెందిన బుడ్డిపేట గ్రామం వాసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై పలువురు తెదేపా నేతలు మీడియా ప్రతినిధులు కేసీఆర్ స్వస్థలం విజయనగరం జిల్లా, సీతానగరం మండలం, బుడ్డిపేట గ్రామానికి వెళ్లారు. అక్కడ కేసీఆర్ పుట్టుపూర్వోత్తరాలపై పూర్తి వివరాలు సేకరించారు. అక్కడ ఉన్న స్థానిక గ్రామస్థులతో ప్రాతికేయులు, మీడియా సిబ్బంది ముచ్చటించారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల వివరాలపై ఆరా తీశారు. కేసీఆర్ తాతముత్తాతలు ఈ గ్రామంలోనే నివశించారని, తాత వెంకట్రావు, తండ్రి రాఘవరావులు అని చెప్పారు. వీరు నివశించి పాడైపోయిన ఇంటిని కూడా స్థానికులు చూపించారు. కేసీఆర్ తాతల కాలంలో తెలంగాణ ప్రాంతంలో వ్యాపారాలు చేసేవారని, ఆవిధంగా వెళ్లి అక్కడే స్థిరనివాసులుగా ఉండిపోయారని తమ పెద్దవారు చెప్పేవారని గ్రామస్థులు తెలిపారు. విజయనగరం జిల్లా వాసిగా ఉండి సమైక్యాంధ్రకు తూట్లు పొడుస్తూ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేయడం అనైతికమని గ్రామస్థులు పేర్కొన్నారు.