TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీకి ఎందుకు?కేసీఆర్‌పై మోత్కుపల్లి ఫైర్

Published on: Wed Dec 28, 2011 8:16AM

హైదరాబాద్: "ఓ చవట సన్నాసి కేసీఆర్... సకలజనుల సమ్మెను ముగించుకుని ఢిల్లీకి ఎందుకు పోయినవ్..? తెలంగాణా కోసమా.. లేకా కోట్ల రూపాయల టెండర్లను దక్కించుకోవడానికా...?" అంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. కరీంనగర్‌లో చంద్రబాబు రైతుపోరుబాటలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... 700 మంది విద్యార్థుల ఉసురు తీసుకుని 4, 700 కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టును కేసీఆర్ దక్కించుకున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ప్రధానమంత్రితో మాట్లాడిన కేసీఆర్, ఆ తర్వాత కొన్నివేల కోట్ల రూపాయలు నొక్కి పిల్లిలా ఇంటికొచ్చి, 75 ఎకరాల తన ఫామ్ హౌస్ లో పేదల రక్తాన్ని తాగుతూ పడుకున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ ఇచ్చేది లేదని ప్రధాని చెప్పేస్తే, వారికేదో టైం ఇచ్చామని కేసీఆర్ చెపుతుండు అని ఎద్దేవా చేశారు. ముమ్మాటికీ తెలంగాణ రాకుండా అడ్డుపడింది కేసీఆరేనని మోత్కుపల్లి అన్నారు. కేసీఆర్ కోసం, కేసీఆర్ కొడుకు కోసం, కేసీఆర్ అల్లుడు కోసం ఉద్యమాన్ని ఉపయోగించుకుని కోట్లు దండుకున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం ఇద్దరం కలిసి ఉరి వేసుకుందాం రమ్మని పిలిస్తే కేసీఆర్ దాక్కున్నాడని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని స్వార్థం కోసం ఉపయోగించి కేసీఆర్ రూ. 50 వేల కోట్లు సంపాదించుకున్నారనీ, ఆ డబ్బునంతా బలిదానాలు చేసుకున్న కుటుంబాలకు పంచాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. మోత్కుపల్లి ప్రసంగిస్తుండగానే కొందరు తెలంగాణా వాదులు స్టేజిపైకి దూసుక వచ్చేందుకు యత్నించారు. వారిని తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు.