'కేసీఆర్ మౌనం తుఫాన్ ముందు ప్రశాంతత'
Published on: Wed Dec 21, 2011 3:41PM
హైదరాబా
ద్: తెలంగాణ చీఫ్ కేసీఆర్ మాట్లాడటం లేదంటే తెలంగాణలో త్వరలో తుఫాన్ వచ్చే అవకాశం ఉన్నట్లేనని తెరాస నాయకులు అంటున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు రైతుపోరుబాట పేరుతో తెలంగాణలో పర్యటిస్తున్నారు.బాబు పోరుబాటకు ప్రారంభంలో కాస్త ఆందోళనలు ఇబ్బందిపెట్టినా, ఆ తర్వాత తెలంగాణకు నేను ఓకే అని చెప్పడంతో తెలంగాణవాదుల నుంచి ఆయనకు మెల్లమెల్లగా మద్దతు పెరుగుతోంది.
మరోవైపు వైఎస్ జగన్ కూడా తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బాబు రైతుపోరుబాట సక్సెస్ అవుతున్న నేపథ్యంలో జగన్ కూడా తన ఓదార్పును విజయవంతం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.తెలంగాణలో సీమాంధ్ర నాయకులు ఇలా హల్‌చల్ చేస్తున్న తరుణంలో కేసీఆర్ మాత్రం మౌనముద్రను దాల్చారు. కేసీఆర్ మౌనం తుఫాన్ ముందు ప్రశాంతత అని ఆయన కుమారుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంటే కేసీఆర్ మాట్లాడితే తుఫాన్ వచ్చేస్తుందన్నమాట.


