TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేబీఆర్ పార్క్ వన్‌వే ట్రయల్ రన్...వాహనదారులకు తిప్పలు

Published on: Sun Jun 21, 2026 12:29PM

 

హైదరాబాద్‌లోని KBR పార్క్ సమీపంలో కొత్తగా అమల్లోకి వచ్చిన వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు పలువురు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రాంగ్‌రూట్‌లో వచ్చిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుని యూ-టర్న్ చేయిస్తుండగా, కొందరు మాత్రం పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ద్విచక్ర వాహనదారుడు పోలీసులతో తీవ్రస్థాయిలో వాదించాడు. "సార్... నా బండిలో పెట్రోల్ లేదు. ఇప్పుడు నేను ఆఫీసుకు ఎలా వెళ్లాలి? అంత దూరం తిరిగి వెళ్లలేను" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 

దీంతో అక్కడ ఉన్నవారంతా అతని మాటలు ఆసక్తిగా గమనించారు. ఇంకా మరో వ్యక్తి "నేను రోడ్ నెంబర్-10కి వెళ్లాలి. చుట్టూ తిరిగి వెళ్లడానికి నేను పిచ్చోడినా? నాకు అసలు టైమ్ లేదు" తాను "అంబులెన్స్ డ్రైవర్‌ని" అని చెప్పి తన పరిస్థితిని అర్థం చేసుకో వాలని కోరాడు.. సినీ నిర్మాత దిల్‌రాజుకు కూడా యూ-టర్న్ తిప్పలు తప్పలేదు... ఆఫీస్ కు బయలుదేరిన దిల్ రాజ్ ను పోలీసులు అడ్డుకుని యూ-టర్న్ చేసుకొని వెళ్ళాలని సూచించారు. దీంతో చేసేదేమీ లేక దిల్ రాజ్ యూ-టర్న్ చేసుకొని అక్కడి నుంచి వెళ్లిపో యారు.

అయితే ట్రాఫిక్ పోలీసులు మాత్రం నిబంధనల విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. రాంగ్‌రూట్‌లో ఎవరినీ అనుమతించబోమని, అందరూ తప్పనిసరిగా సూచించిన మార్గంలోనే వెళ్లాలని సూచించారు. దీంతో వాహనదారుడు యూ-టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. KBR పార్క్ వన్‌వే అమలుతో ట్రాఫిక్ నియంత్రణ మెరుగుపడుతున్నప్పటికీ, మారిన మార్గాలపై పూర్తి అవగాహన లేక కొందరు వాహనదారులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు మాత్రం ప్రజలు సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా సమయం, ప్రాణాలు రెండూ కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

దేవిధంగా యూసుఫ్‌గూడ మరియు శ్రీనగర్ కాలనీ ప్రాంతాల నుండి జూబ్లీహిల్స్, మాదాపూర్, రోడ్ నంబర్ 36 మరియు 45 వైపు వెళ్లే వాహనదారుల కోసం ఇందిరానగర్ గడ్డా రోడ్, వెంకటగిరి జంక్షన్, డైమండ్ హౌస్ మరియు అల్కజార్ ప్లాజా మీదుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ బైలేన్, ఎన్‌టీఆర్ భవన్, ఫిల్మ్‌నగర్, సీనియర్ వ్యాలీ మీదుగా షేక్‌పేట్ వైపు వెళ్లేందుకు మరో రూట్ కేటాయించారు.

ఐటీసీ కోహినూర్ మరియు కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతాల నుండి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, వెంకటగిరి, ఎన్‌టీఆర్ భవన్ మరియు పంజాగుట్ట వైపు ప్రయాణించే వాహనాలను రోడ్ నంబర్ 60 మరియు 67 మార్గాల ద్వారా రోడ్ నంబర్ 1 కి కనెక్ట్ అయ్యేలా మళ్లించారు. చిన్న రోడ్లలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోకుండా ఉండేందుకు భారీ వాహనాల రాకపోకలపై పీక్ అవర్స్‌లో ఆంక్షలు విధించారు.