కావూరిపై జగన్ పార్టీ కోడిగుడ్లు

 

 Kavuru Samba Siva Rao, Jagan Moha Reddy, samaikyandhra, telangana bill

 

 

కేంద్ర జౌళీశాఖ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కావూరి సాంబశివ రావు పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడిలో జగన్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన వాహనం పైకి కోడిగుడ్లు విసిరి..సమైక్య నినాదాలు చేశారు. దీంతో అక్కడి పరిస్థితి కొంత ఉద్రిక్తత౦గా మారింది. పోలీసులు లాటీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మద్దాల రాజేష్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.