TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రజా సమస్యలపై పోరాటాలు బీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలా?.. నిలదీసిన కవిత

Published on: Wed Sep 3, 2025 12:36PM

తాను ప్రజా పోరాటాలు చేస్తే వాటిని ప్రజావ్యతిరేక కార్యకలాపాలుగా బీఆర్ఎస్ దుష్ప్రచారం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసిన తరువాత తొలి సారిగా బుధవారం (సెప్టెంబర్ 3)న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జై తెలంగాణ నినాదంతో ప్రారంభించిన ఆమె తనను సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ విడుదల చేసిన లేఖలోని రెండు అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.  

మద్యం కుంభకోణం కేసులో తాను అక్రమంగా అరెస్టై ఐదు నెలలు తీహార్ జైలులో ఉండి బయటకు రాగానే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజాసమస్యలపై పోరాడుతున్నానన్న ఆమె.. అలా ప్రజా సమస్యలపై పోరాడటం పార్టీకి వ్యతిరేకమా అని ప్రశ్నించారు. ఓ బిడ్డ హాస్టల్‌లో చనిపోతే అక్కడి వెళ్లాను. గురుకులాల్లో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడాను. బీసీలకు జరుగుతున్న అన్యాయం గురిం చి.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన 42 శాతం హామీ కోసం పోరాడాను, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మహిళలకు 2500 రూపాయలు ఇవ్వాలని గళమెత్తాను ఇవన్నీ బీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలా అని ప్రశ్నించారు బీసీల కోసం మాట్లాడితే తనపై దుష్రచారం చేస్తున్నారని కవిత విమర్శించారు.