ఇందిరా పార్క్ వద్ద కవిత నిరాహార దీక్ష
Published on: Fri Apr 13, 2012 11:58AM
అసెంబ్లీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాస్థాపన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద 48 గంటల పాటు నిరాహార దీక్ష ప్రారంభించారు. మీడియాతో కవిత మాట్లాడుతూ రేపటిలోగా విగ్రహ ఏర్పాటుపై ముఖ్యమంత్రి ప్రకటన చేయకుంటే ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయటంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. అంతకు ముందు ఆమె ట్యాంక్బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.


