TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కుమారుడికి గ్రాడ్యుయేషన్ పట్టా.. సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేసిన కవిత

Published on: Tue May 20, 2025 3:02PM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ కుమారుడు ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టాను అందుకున్నారు.  యూనివర్శిటీలో  జ‌రిగిన గ్రాడ్యుయేష‌న్ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్సీ క‌విత‌, అనీల్ కుమార్ దంప‌తులు హాజ‌ర‌య్యారు.

గ్రాడ్యుయేష‌న్ కు సంబంధించిన ఫోటోను  కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  ఆదిత్యా, నీ చిట్టి చేతిని పట్టుకోవడం నుండి నువ్వు డిగ్రీ పట్టుకోవడం వరకు చూశాను. ఈ గోప్ప ప్రయాణంలో నీవు చాలా కష్టపడ్డావు. ఎంతగానో ఎదిగావు, మమ్మల్ని గర్వపడేలా చేశావు అంటూ  ఆనందం వ్యక్తం చేశారు.  కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిత అమెరికా పర్యటనకు ఢిల్లీలోని సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఆమెకు వారం రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. కవిత ఈ నెల 23న అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు.