బిజేపికి ఓటు వేస్తా.. కేసీఆర్ మహిళల పక్షపాతి.. కవిత
Published on: Mon Jan 4, 2016 4:13PM
.jpg)
కేసీఆర్ కూతురు.. టీఆర్ఎస్ ఎంపీ కవిత బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. కేంద్రం నుండి హైదరాబాద్ కు 20 వేల కోట్ల రూపాయిల ప్యాకేజీ తీసుకువస్తే ఈసారి ఎన్నికల్లో బిజెపికి ఓటు వేస్తానని కేంద్రమంత్రి దత్తాత్రేయ, బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిలకు ఆమె సవాల్ విసిరారు. పేదలు ఎక్కువగా ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే ఉన్నారని.. పేదల ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామని ఆమె తెలిపారు. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల పక్షపాతి అని, అందుకే మహిళలకు 75 సీట్లు కేటాయించారని ఆమె అన్నారు.


