కుల గణనకు కవిత ఓకే
Published on: Sat Nov 16, 2024 5:24PM
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేకు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పూర్తిగా సహకరించారు. మొత్తం 8 పేజీల్లో 75 ప్రశ్నలతో కూడిన ఫామ్ ను ఆమె ఎంతో ఓపికగా నింపారు. కులగణను బిఆర్ఎస్ మొదట్నుంచి వ్యతిరేకిస్తుంది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ కులగణనను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.అయితే కవిత మాత్రం కులగణనను వ్యతిరేకించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పేద, మధ్య తరగతి ప్రజానీకానికి ప్రయోజనం చేపట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీల నేతల వివరాలను ప్రభుత్వం సేకరిస్తుంది. ప్రజల గోప్యత పోతుందని బిఆర్ ఎస్ తొలుత ప్రచారం చేసింది. శనివారం బంజారాహిల్స్ లోని తన నివాసానికి ఎన్యుమరేటర్లు వచ్చినప్పుడు కవిత ఎంతో ఓపికగా సమాధానాలు రాసిచ్చారు. ఆధార్ కార్డు, పాన్ కార్డుతో బాటు అన్ని వివరాలు ఆమె ప్రభుత్వానికి సహకరించారు.


