అత్యాచారం చేస్తే మరణదండనే..!

 

కథువా, ఉన్నావో అత్యాతార కేసులు పెద్ద సంచలనమే సష్టించాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనలు అరికట్టే చర్యలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా... అత్యాచార ఘటనల నుంచి పిల్లలను సంరక్షించే చట్టం(పోక్సో)కు సవరణలను చేసి.. దానికి ఆమోద ముద్ర వేసింది. 12 ఏళ్ల లోపు బాలికలపై ఎవరైనా అత్యాచారం చేస్తే వారికి మరణదండన తప్పదని తేల్చిచెప్పింది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంత్రిమండలి సమావేశమైంది. నిర్ణయం అనంతరం చట్టసవరణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులపై రాష్ట్రపతి సంతకం చేసిన పిదప ఆర్డినెన్స్‌ వెలువడనుంది.