కథువా కేసులో మరిన్ని నిజాలు...అందుకే ఆ అమ్మాయిని చంపించా..
Published on: Sat Apr 28, 2018 5:16PM

కథువా అత్యాచార కేసు దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈకేసులో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈకేసుపై ప్రస్తుతం సుప్రీకోర్టులో విచారణ జరుగుతుండగా.. రేపిస్ట్‌లలో తన కుమారుడు ఉన్నాడు కాబట్టే ఆ అమ్మాయిని చంపించామని కేసులో ప్రధాన నిందితుడైన సాంజిరామ్ వెల్లడించాడు. ఆ బాలికపై తన కుమారుడు, మేనల్లుడు కలిసి అత్యాచారం చేశారని, ఈ విషయం బయట పడకూడదనే బాలికను హత్య చేశామని.. అత్యాచారం జరిగిన నాలుగు రోజుల తరువాత చంపినట్లు అతడు పేర్కొన్నాడు. అంతేకాదు హిందువుల ప్రాబల్యం ఉన్న ఆ ప్రాంతం నుంచి ముస్లింలను తరిమికొట్టేందుకే ఆ అమ్మాయిని అపహరించినట్లు అతడు తెలిపాడు. కాగా ఈ కేసును విచారిస్తున్న సుప్రీం కోర్టు తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది.


