కత్తి రాజకీయ కలలకు గండి..!!

ఒకప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేవాళ్ళు.. ఇప్పుడు కొత్తగా, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే నగర బహిష్కరణ అవుతారు అంటున్నారు.. ఇది కత్తి మహేష్ కు కరెక్ట్ గా సరిపోతుంది.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ కత్తి మహేష్.. ఫిలిం క్రిటిక్ గా కొందరికి పరిచయమైన మహేష్, బిగ్ బాస్ పుణ్యమా అని చాలా మందికి పరిచయం అయ్యారు.. ఆ ఫేమ్ ని అలా కంటిన్యూ చేసుకుంటే బాగుండేది.. కాని అలా ఉంటే కత్తి ఎందుకు అవుతాడు.. వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియా, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకున్నాడు.

పవన్ మీద వ్యాఖ్యలు, పవన్ ఫ్యాన్స్ తో వివాదం.. దీంతో కొన్ని రోజులు మీడియాలో నానాడు.. తరువాత మూడు వ్యాఖ్యలు ఆరు విమర్శలతో గాలి వానలో పడవ ప్రయాణంలా సాగిపోయింది మహేష్ జీవితం.. ఇదే ఉత్సహంతో ఆయన రాజకీయ రంగప్రవేశం కూడా చేయాలనుకున్నారు.. వైసీపీ తరుపున చిత్తూర్ ఎంపీగా కత్తి పోటీ చేస్తున్నాడనే వార్తలు కూడా వచ్చాయి.. ఇక కత్తి రేపో మాపో పొలిటికల్ ఎంట్రీ అనుకుంటుండగా ఆయన నోటి దూలతో సిటీ నుండి ఎగ్జిట్ అయ్యాడు.

ఒక టీవీ ఛానెల్ డిబేట్ లో పాల్గొన్న కత్తి, శ్రీ రాముడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసాడు.. ఈ వ్యాఖ్యలకు ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వ్యక్తమయ్యాయి.. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కత్తి వ్యాఖ్యలను వ్యతిరేకించాయి.. ఇప్పుడు కత్తి మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు టికెట్ ఇచ్చే సాహసం ఏ పార్టీ చేయదు.. ఎవరి కర్మకు వారే బాధ్యులు అన్నట్టుగా, కత్తి మహేష్ తన రాజకీయ కలలకు తన వ్యాఖ్యలతో గండి కొట్టుకున్నాడు.