తెలుగు తల్లిపై కూడా అవసరమా..?

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూ.. ఒక్కసారిగా అందరికి దృష్టిలో పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ కత్తి మహేశ్ లా తయారైంది పరిస్థితి. పవన్ పైనే కాదు.. పలువురి మీద కామెంట్లు వేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక ఎప్పటిలాగే తన వృత్తిలో భాగంగా.. రాజమౌళిపై కత్తి మహేశ్ ఓ ప్రశ్న సంధించాడు. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల డిజైన్ల విషయంలో చంద్రబాబు రాజమౌళి సలహాలు కోరిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే రాజమౌళి  అసెంబ్లీలో తెలుగు తల్లి విగ్రహం యొక్క డిజైన్ ను రూపొందించి.. దాని వీడియోను విడుదల చేశారు. ఇక బాహుబలి సినిమాతో వండర్ సృష్టించిన రాజమౌళి.. ఈ విషయంలో కూడా తన క్రియేటివిటీ చూపించాడు. ఈ వీడియోను చూసిన వారందరూ రాజమౌళికి ఫిదా అయిపోతున్నారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామిపై సూర్య కిరణాలు ఎలా అయితే ప్రతిబింభించి దర్శనమిస్తాడో, అలాగే ఏపీ అసెంబ్లీలో కూడా కంప్యూటరైజ్ద్ పరిజ్ఞానంతో అసెంబ్లీలోని తెలుగు తల్లిపై సూర్యకిరణాలు పడే విధంగా ఈ డిజైన్ ను సిద్ధం చేసారు. ఉదయం 9.15 గంటలకు సూర్యకిరణాలు పడేలా డిజైన్ ఉంటే బావుంటుందని ఆయన సూచించారు.

 

మరి నిజంగా ఇది ఇప్లిమెంట్ చేస్తారో లేదో తెలయదుకానీ.. అప్పుడే దీనిపై కత్తి మహేశ్ స్పందించి ఆవేశంగా రాజమౌళిపై కామెంట్లు చేశాడు. ‘‘తొలి కిరణం.. తెలుగు తల్లి పాదాలను తాకకపోతే వచ్చే నష్టం ఏదైనా ఉందా..?’’ అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఎప్పటిలాగే ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. ఏదో తనను సలహాలు అడిగినందుకు.. చంద్రబాబు గారి మీద ఉన్న గౌరవంతో రాజమౌళి ఈ బాధ్యతను తీసుకున్నారు. తనకు తోచిన సలహాలు ఇస్తున్నారు. దీనిలో భాగంగానే ఓ వీడియో విడుదుల చేశారు. అది ఇంకా ఏపీ ప్రభుత్వం ఆమోదించలేదనూ లేదు. అసలు అది జరగుతుందో లేదో కూడా తెలియదు.. మరి అప్పుడే కత్తి మహేశ్ కు ఇంత ఆవేశం అవసరమా అని అంటున్నారు. ఏదో విమర్సలు చేయాలని కాకపోతే ఏంటిది.. క్రిటిక్ కదా ఏ విషయంపైన అయినా విమర్శలు చేయోచ్చు అని అనుకుంటున్నాడు.. తెలుగు తల్లి విగ్రహంపై కూడా ఇలాంటి కామెంట్లు చేస్తున్నాడంటే అది కత్తి మహేశ్ విజ్ఞతకే వదిలేయాలి. మరి ఇలాంటి మనిషి మాటలు కూడా పట్టించుకోవాల్సిన విషయం ఏమన్నా ఉందా.. ఆలోచించుకోవాలి...