TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రేపటిలోగా వెళ్లిపోండి.. భాగ్యనగరంలో ఉన్న పాకిస్థానీల‌కు నోటీసులు

Published on: Sat Apr 26, 2025 3:13PM

 

కాశ్మీర్ ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న నేప‌థ్యంలో హైదరాబాద్‌లో ఉంటున్న న‌లుగురు పాక్ పౌరుల‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరు షార్ట్ వీసాల‌తో ఉంటున్న‌ట్లు గుర్తించారు. రేప‌టిలోగా నగరం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. కాగా, భాగ్య‌న‌గ‌రంలో మొత్తం 213 మంది పాకిస్థానీయులు ఉన్న‌ట్లు పోలీసుల త‌నిఖీల్లో తేలింది.  ఉగ్రదాడి నేపథ్యంలో  భార‌త ప్ర‌భుత్వం పాకిస్థానీల‌ను దేశం నుంచి వెళ్ల‌గొడుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప‌లు రాష్ట్రాల్లో పోలీసులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. 

త‌నిఖీలు చేప‌ట్టి పాకిస్థానీల‌ను గుర్తిస్తున్నారు. హైదరాబాద్ లో నలుగురు పాకిస్తానీయులకు పోలీసులు నోటీసులు ఇచినట్లు తెలుస్తోంది. నలుగురు వ్యక్తులు షార్ట్ టర్మ్ వీసా (STV) హోల్డర్స్ గా ఉన్నట్లు గుర్తింపు. రేపటి లోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఈ నెల 27 తర్వాత వీసాలు రద్దవుతాయి డీజీపీ జితేందర్ తెలిపారు. మెడికల్‌ వీసా దారులకు ఈ నెల 29 వరకు గడువు ఉంటుందని పేర్కొన్నారు.