పార్టీ అధ్యక్షునిగా ఐదు దశాబ్దాలు...

 

పార్టీ వ్యవస్థాపకులలో ఒకరిగా,50 ఏళ్ళు పార్టీ అధ్యక్షునిగా,పోటీ చేసిన ప్రతిసారి గెలిచి 13 సార్లు శాసనసభ కు ఎన్నికై ఐదుసార్లు ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టి అత్యధికకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రాజకీయాల్లో ఎంతో ఖ్యాతి గడించిన వ్యక్తి కరుణానిధి.1949 లో అన్నాదురై డీఎంకే పార్టీ స్థాపించినప్పుడు డీఎంకే వ్యవస్థాపక సభ్యుల్లో కరుణానిధి ఒకరు.ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి సీమాంధ్ర ప్రాంతం విడిపోయిన అనంతరం తమిళనాడు శాసనసభకు జరిగిన ఎన్నికలలో 1957లో తొలిసారి డీఎంకే రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేసింది.

 

 

ఆ ఎన్నికలో కరుణానిధి తమిళనాడులోని కుళితలై నియోజక వర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.తమిళనాడు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 13 సార్లు శాసనసభకు ఎన్నికైన వ్యక్తిగా కరుణానిధి రికార్డు నెలకొల్పారు.1967 డీఎంకే తొలిసారి తమిళనాట అధికారం చేపట్టినప్పుడు ముఖ్యమంత్రి అన్నాదురై కేబినెట్లో ప్రజాపనుల శాఖ మంత్రిగా కరుణానిధి బాధ్యతలు చేపట్టారు. 1969లో అన్నాదురై మరణానంతరం కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగాను,డీఎంకే అధ్యక్షునిగాను బాధ్యతలు చేపట్టారు.ఇంతటి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న కరుణానిధి ఆరోగ్యం క్షీణించిందని వందతులు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్‌ మీడియా ముందుకు వచ్చి పుకార్లపై స్పందించారు.కరుణానిధి ఆరోగ్యంగానే ఉన్నారని, వదంతుల్ని, పుకార్లను నమ్మవద్దని, ఆయనకు స్వల్ప జ్వరం వచ్చిందని, అందుకే వైద్యులు వచ్చి పరీక్షించి వెళ్లారని తెలిపారు.