కరుణానిధి ఆరోగ్యంపై వీడని ఉత్కంఠత

కరుణానిధి తీవ్ర జ్వరం, మూత్రనాళంలో ఇన్పెక్షన్‌ కారణంగా మూడు రోజుల క్రితం కావేరీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.ఆయన ఆరోగ్య విషయంలో వస్తున్న వార్తలతో ప్రజలు,నాయకులూ ఆందోళనకు గురవుతున్నారు.నిన్న ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేరుగా కరుణ వార్డులోకి వెళ్లి ఆయన్ని చూశారు.స్టాలిన్,కనిమొళిలను పరామర్శించారు. వైద్యులు మొదట విషమంగా ఉన్నప్పటికీ ఇప్పుడు చికిత్సకు స్పందిస్తున్నారని చెప్తూవచ్చారు.అయితే రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కరుణ కుటుంబీకులంతా తీవ్ర ఆవేదనలో ఆసుపత్రికి చేరారు.

 

 

ఒక్కొక్కరిగా వరుసగా ఆసుపత్రికి వస్తుండడంతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. అదే సమయంలో అక్కడికి కార్యకర్తలు భారీగా తరలిరాగా, పోలీసులు కూడా అదే స్థాయిలో మోహరించారు. దీనికి తోడు నగరం మొత్తం పోలీసులు మోహరించడంతో పాటు ఎక్కడికక్కడ బ్యారీకేడ్లు ఏర్పాటు చేశారు.దీంతో మీడియా కూడా జరగరానిదేదో జరిగిందని పసిగట్టింది. రాత్రి 11.30 గంటల వరకు ఈ గందరగోళం కొనసాగింది.రాత్రి 11.45 గంటలకు విడుదల చేసిన ప్రకటనలో కరుణ కోలుకుంటున్నందున ఆసుపత్రి వద్దగుమిగూడిన కార్యకర్తలంతా వెళ్లిపోవాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా నడుచుకోవాలని,ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, కార్యకర్తలు సంయమనం పాటించాలని, డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ విజ్ఞాప్తి చేశారు.