కరుణానిధి ఖననం విషయంలో పళని వర్సెస్ స్టాలిన్!

 

సాయంత్రం 6.10 గంటలకు మృతి చెందిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పార్థివ దేహాన్ని గోపాలపురంలోని ఆయన నివాసానికి అంబులెన్స్ లో తరలిస్తున్నారు.  చెన్నైలోని కావేరి ఆసుపత్రి నుంచి బయలుదేరిన వాహనం వెంట కరుణానిధి భౌతికకాయంతో పాటూ కుటుంబసభ్యులు, సన్నిహితులు ఉన్నారు.

 

 

కావేరి ఆసుపత్రి వద్ద, గోపాలపురంలోని దివంగత నేత నివాసం వద్దా డీఎంకే కార్యకర్తలు భారీ సంఖ్యలో పోగయ్యారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. తమ అభిమాన నేత కరుణానిధి మృతిని జీర్ణించుకోలేపోతున్నారు వేలాది అభిమానులు! వారి రోదనలతో చెన్నై కన్నీటి చెరువైపోయింది!

 

ద్రవిడ ఉద్యమ మహానేత అన్నాదురై సమాధి వద్దే కరుణానిధిని ఖననం చేయాలని ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే, డీఎంకే నేతల విఙ్ఞప్తిపై తమిళనాడు అన్నాడీఎంకే ప్రభుత్వం సానుకూలంగా లేన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని పళనిస్వామి ప్రభుత్వం చెబుతున్నట్టు సమాచారం. డీఎంకే నేతలు, కార్యకర్తలు ఇప్పటికే సర్కార్ పై మండిపడుతున్నారు. వారు కోర్టును ఆశ్రయించాలని కూడా ఆలోచిస్తున్నారట…