TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

క్రికెట్ ఆడిన కరుణానిధి..

Published on: Thu Mar 1, 2018 12:22PM

 

తమిళనాట డీఎంకే అధినేత కరుణానిధి ఏం చేసినా వార్తల్లోకి ఎక్కాల్సిందే. గత కొద్దికాలంగా కరుణానిధి ఆరోగ్యం సరిగ్గా లేని సంగతి అందరికీ తెలసిందే. చాలా కాలం నుండి ఆయన కుర్చీకే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు ఆయన క్రికెట్ ఆడి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఏదో గ్రౌండ్ కు వెళ్లి ఆయన క్రికెట్ ఆడలేదులేండి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తాజాగా కరుణానిధి తన మనవడితో కలిసి క్రికెట్ ఆడారు. తన ఇంట్లోనే, తన చక్రాల కుర్చీలో కూర్చునే ఆయన ఆడారు. తన మునిమనవడు బ్యాటు పట్టుకుని ఆడుతుంటే, సరదాగా బౌలింగ్ చేశారు. ఇంట్లోని ఆయన బంధువుల్లోని ఇద్దరు మహిళలు ఫీల్డింగ్ చేస్తూ, బాల్ ను కరుణానిధికి అందించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.