TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

చిదంబరంకు షాక్.. కార్తీ చిదంబరం అరెస్ట్..

Published on: Wed Feb 28, 2018 9:54AM

 

కేంద్ర మాజీ ఆర్థికశాఖ మంత్రి చిదంబరం కు షాక్ తగిలింది.  ఐఎన్ఎక్స్ మీడియా స్కాం లో ఆయన కుమారుడు కార్తీ చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. చిదంబరం కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో... మారిషస్ నుంచి పెట్టుబడులను అందుకునే విషయంలో.. విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు నిబంధనలను ఐఎన్ఎక్స్ మీడియా ఉల్లంఘించినట్టు  కార్తి చిదంబరంపై ఆరోపణలున్నాయి. దీంతో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనతో పాటూ కేసుకు సహకరించడం లేదనే ఆరోపణలతో కార్తిని చెన్నై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. లండన్ నుంచి తిరిగివచ్చిన ఆయనను. చెన్నై ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేసి, తమ కార్యాలయానికి తరలించారు. ఆయనను ఢిల్లీకి తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.