లండన్ చెక్కేసిన కార్తి చిదంబరం....

 

బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విజయ్ మాల్యా లండన్ చెక్కేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ మాల్యాని గుర్తు చేశారు కార్తి చిదంబరం. ఒకపక్క ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తుంటే.. ఈ టైంలో లండన్ చెక్కేశారు. వివరాల ప్రకారం..ఆర్థికమంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం పై ఎయిర్ సెల్ మాక్సిస్ 2జీ స్కామ్,  ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇప్పించి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవలే చిదంబరం, కార్తి ఇళ్లలో ఐటీ దాడులు కూడా జరిపారు. అయితే ఇప్పుడు కార్తి చిదంబరం లండన్ పారిపోయారు. లండన్ వెళ్లిపోయారని చెన్నై ఎయిర్ పోర్టు అధికారులు ధ్రువీకరించారు. అతని పాస్ పోర్టుపై ఆంక్షలేమీ లేకపోవడంతోనే ఆపలేకపోయామని తెలిపారు. దీంతో ఇంత సడెన్ గా కార్తి లండన్ కు వెళ్లడం చర్చాంశమైంది.