TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రమంతా కార్తీక శోభ

Published on: Thu Nov 6, 2014 12:49PM

రాష్ట్రమంతా కార్తీక శోభతో వెలిగిపోతోంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలన్నీ శివనామస్మరణతో హోరెత్తుతున్నాయి. దేవాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. నదీతీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి దైవదర్శనం చేసుకున్నారు. అభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక దీపాలు వెలిగించి భక్తిభావాన్ని చాటుకున్నారు. అటు శ్రీశైలం మొదలుకొని మహానంది, శ్రీకాళహస్తి, తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం, తాడిపత్రిలోని బుగ్గ రామేశ్వరాలయం, రాయచోటి శివాలయం, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు శివాలయాలు... ఇలా పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.