TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కార్తీక మాసంతో రాష్ట్రమంతటా ఆధ్యాత్మిక శోభ

Published on: Mon Nov 4, 2013 2:55PM

 

Karthika masam, Karthika masam pujas, Karthika masam news

 

 

రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక మాసం సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ తెల్లవారు జామునుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో శివుడికి పూజలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో శివాలయాలు కిక్కిరిసిపోయాయి. కార్తీక మాసం ప్రారంభమవుతుండడంతో రాష్ట్రమంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తొలిరోజే సోమవారం కావడంతో శివాలయలకు భక్తులు పోటెత్తారు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులంతా మహాశివుని దర్శనానికి క్యూకట్టారు.


సోమవారమంటే మహాదేవునికి మహా ప్రియం అందులోనూ ఈసారి విశేషించి సోమవారంనాడే ఈ మాసం ప్రారంభమైంది.
ఈ మాసమంతా శివారాధనా, ఉపవాసం చెయ్యలేనివారు కేవలం ఈ ఒక్క సోమవారంనాడైనా నిండుమనస్సుతో చెయ్యగలిగితే వారు తప్పక కైవల్యాన్ని పొందుతారు. ఈ మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా శివదేవునికి అభిషేకం, అర్చనలు చేసినవారు వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు.