కర్నూలులో కాటసాని - కోట్ల ఢీ అంటే ఢీ
Published on: Fri Feb 24, 2012 12:38PM
కర్
నూలు: వ్యాపార లావాదేవీల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామారెడ్డి, డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. బేతంచర్ల సమీపాన ఉన్న జయజ్యోతి సిమెంటు ఫ్యాక్టరీకి సంబంధించిన బాక్సైట్ ముడి ఖనిజం తరలింపు లైసెన్స్ తనకు వచ్చిందని ఎమ్మెల్యే కాదు తనకు మాత్రమే ఉందని మాజీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్య వాగ్వివాదం తలెత్తి ఉద్రిక్తతకు దారితీసింది. నేరుగా ఎమ్మెల్యే రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మలు రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అయోమయం నెలకొంది. జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి బాక్సైట్ ముడిపదార్ధం గోవానుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా బేతంచర్ల రైల్వే స్టేషన్ లో అన్ లోడ్ అవుతుంది. ఈ ముడి ఖనిజాన్ని తరలించేందుకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వర్గీయులకు మొదట్లో లైసెన్స్ ఉంది. దాన్ని రద్దు చేయించి డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ తన వర్గీయుల పేరిట లైసెన్స్ తెప్పించారు. విషయం తెలుసుకున్న కాటసాని సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం పీకలమీద కూర్చుని ఆ లైసెన్స్ ను రద్దు చేయించి తిరిగి తన వర్గీయులకు ఇప్పించుకున్నారు.


