బీజేపీ గుట్టు రట్టు... గోడ దూకేయ్.. బయటే కారుంది

 

కన్నడ రాజకీయాల్లో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీజేపీ అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. అలా అధికారం చేపట్టారో లేదో అప్పుడే బల నిరూపణ కోసం కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు గాలం వేయడం స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరు నగర శివారులోని ఈగల్టన్‌ రిసార్టులో బస చేస్తున్న జేడీఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు పోలీసులు ఆకస్మికంగా భద్రత ఉపసంహరించుకున్నారు. ఇదంతా బీజేపీ కుట్రలో భాగమే అని.. తమ ఎమ్మెల్యేలను తమవైపుకు లాక్కోవడానికే ఇలాంటి చర్యలు చేపడుతున్నరాని ఆరోపించాయి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు. ఈ ఆరోపణలు నిజమని తాజాగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

 

కాంగ్రెస్ చెప్పిన దాని ప్రకారం.. నేను రిసార్టులో ఉండగా.. నన్ను గోడ దూకి ఎలాగైనా బయటికి రావాలని ఓ ఫోన్ వచ్చింది. అంతేగాక. రిసార్టు బయటే ఓ కారు మీ కోసం వేచి ఉందని చెప్పారు' అని తనకు వచ్చిన ఫోన్ కాల్ గురించి చెప్పారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన రెండు పార్టీలు వెంటనే..  తమ ఎమ్మెల్యేలను కేరళకు తరలించాలనుకున్నారు. ప్రత్యేక విమానంలో కేరళకు తరలించాలనుకున్నారు కానీ.. పౌరవిమానయాన శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో ప్లాన్‌ మార్చారు. ఎమ్మెల్యేలందరినీ ప్రత్యేక బస్సుల్లో ఎక్కించి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య హైదరాబాద్‌కు తరలించారు. ఎమ్మెల్యేలను సురక్షితంగా కాపాడుకోవడానికి హైదరాబాదే సరైన ప్రదేశమని కాంగ్రెస్‌, జేడీఎస్‌ భావించి ఇక్కడికి తరలించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముందుగా పార్క్‌ హయత్‌కు వెళ్లాలని భావించిన ఎమ్మెల్యేలు.. భద్రతా పరంగా అనుమానాలు వ్యక్తం కావడంలో ప్లాన్‌ మార్చుకున్నారు. దీంతో జేడీఎస్‌ ఎమ్మెల్యేలు నోవాటెల్‌ హోటల్‌కు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తాజ్‌కృష్ణకు చేరుకున్నారు. కర్ణాటక ఎమ్మెల్యేలు బస చేసిన హోటళ్ల‌ వద్ద హైదరాబాద్‌ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హోటళ్లలోకి ఇతరులెవరినీ పంపించడం లేదు. ముఖ్యమైన వారిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. మొత్తానికి బీజేపీ బలనిరూపణలో ఎలాగైనా గెలవాలని అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు బాగానే కష్టపడుతున్నాయి. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇంకా ఏడుగురు ఎమ్మెల్యేలను ఎలాగైనా తమ వైపుకు లాక్కోవాలని విశ్వ ప్రయత్నాలే చేస్తోంది. మరోపక్క కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలు బీజేపీకి ప్రలోభపడకుండా.. వారిని కాపాడుకునే పనిలో ఉన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో..