TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ భయం.. నమ్మ క్యాంటీన్లు..

Published on: Wed Mar 15, 2017 4:26PM

 

ఇప్పటి వరకూ అమ్మ క్యాంటీన్ల పేర్లు మాత్రమే విన్నాం. ఇప్పుడు ఈ క్యాంటీన్ల తరహాలోనే నమ్మ క్యాంటీన్లు కూడా త్వరలో రానున్నాయి. వినడానికి విచిత్రం ఉంది కదా.. అసలు సంగతేంటంటే.. మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో అధికారం చేపట్టింది. దీంతో కర్ణాటకలో ప్రభుత్వానికి భయం పట్టుకుంది. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుండే జాగ్రత్త పడుతోంది. ఈ నేపథ్యంలో, మోదీ చరిష్మాను ఎదుర్కోవడానికి, ప్రజలను ఆకర్షించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశ పెడుతోంది. దీనిలోభాగంగానే అమ్మ క్యాంటీన్ల తరహాలో నమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిద్ధమయ్యారు. ఐదు రూపాయలకే టిఫిన్, పది రూపాయలకే భోజనం అందించేలా నమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. బెంగళూరు వ్యాప్తంగా 198 నమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కాగా గోవా, మణిపూర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకున్నా కానీ.. ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మాత్రం విఫలమైంది. ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకోని బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.