కంబళ కోసం కన్నడిగుల ఆందోళన...

posted on: Jan 28, 2017 4:32PM


తమిళనాడులో జల్లికట్టు కోసం జరిగిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని కర్ణాటకలో కూడా కంబళ కోసం కన్నడిగులు ఆందోళనలు చేపట్టిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు వీరి ఆందోళనలు ఉధృతమయ్యాయి. తమిళలు ఉద్యమంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా జెల్లికట్టు నిర్వహించిన నేపథ్యంలోనే  కర్ణాటకలోనూ అదే విధంగా కంబళను నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.  విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, పార్టీలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. అంతేకాదు  కంబళ పోటీలను నిర్వహించక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని కన్నడ ప్రజలు హెచ్చరిస్తున్నారు. దీంతో పరిస్థితిని ముందే గ్రహించిన కర్ణాటక సర్కారు ప్రజల డిమాండుకు అనుకూలంగా స్పందించింది. కంబళ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమేనని ప్రకటించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...