బలపరీక్షకు సుప్రీం గ్రీన్ సిగ్నల్...


కర్ణాటకలో రాజకీయాలు క్షణ క్షణానికి మారుతూ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను బీజేపీ తమవైపు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తుందని... ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తుందని... ఇక్కడే ఉంటే నష్టమని భావించిన కాంగ్రెస్-జేడీఎస్.. తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్‌-జేడీఎస్‌ల పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. రేపు బల నిరూపణ చేసుకుంటే బావుంటుందని సూచించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ల తరఫు న్యాయవాది తమకు 116 మంది ఎమ్మెల్యేల మద్దుతు ఉందని ధర్మాసనానికి తెలుపగా, బీజేపీ తరఫు న్యాయవాది రోహత్గి తమకూ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ల కూటమి అపవిత్రమైనదని వాదించారు. ఇందుకు ప్రతిగా స్పందించిన అభిషేక్‌ సింఘ్వీ ఏ పార్టీ అధికారాన్ని చేపట్టాలో? ఏ పార్టీ చేపట్టకూడదో? సుప్రీం కోర్టు నిర్ణయించాలని కోరారు.

 

అంతేకాదు.. గవర్నర్‌కు ప్రభుత్వ ఏర్పాటును గురించి యడ్యూరప్ప రాసిన లేఖలను ధర్మాసనం పరిశీలించింది. రేపు బలపరీక్ష నిర్వహిస్తే చేస్తే బావుంటుందని సుప్రీం అభిప్రాయం వ్యక్తం చేసింది. పూర్తిగా నంబర్‌ గేమ్‌పై కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు ఆధారపడి ఉందని.. అయితే, ఈ విషయంలో కర్ణాటక గవర్నర్‌దే తుది నిర్ణయమని పేర్కొంది. రెండు ఆప్షన్లను కర్ణాటక ప్రభుత్వానికి ఇస్తున్నట్లు చెప్పింది.