కాంగ్రెస్ ఆశల్లో నీళ్లు...జేడీఎస్ లేకుండానే.

 

కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో గెలవడానికి బాగానే కష్టపడ్డారు. అయితే ఓట్ల లెక్కింపులో ముందుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ హోరా హోరీగా సాగినా.. ఆతరువాత బీజేపీనే ఆధిక్యంలోకి వచ్చింది. దీంతో కర్ణాటక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి, కనీసం జేడీఎస్ మద్దతుతోనైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆశల్లో నీళ్లు పోసినంతపనైంది. ఒక్క బెంగళూరు ప్రాంతంలో మినహా మరెక్కడా కాంగ్రెస్ హవా కనిపించని పరిస్థితి నెలకొంది. మరోవైపు జేడీఎస్ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి బీజేపీ చేరినట్టు అంచనా వేస్తున్నారు. ఎన్నికలు జరిగిన అన్ని చోట్లా ఓట్ల లెక్కింపు ప్రారంభమవ్వగా.. బీజేపీ 114, కాంగ్రెస్ 66, జేడీఎస్ 40, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇదిలా ఉండగా...ఫలితాలు తమకు అనుకూలంగా వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అప్పుడే ఆనందంలో సంబరాలు ప్రారంభించారు.