కన్నడ ఎన్నికల ఫలితాలు.. ఆధిక్యంలో భాజపా

 

ఈనెల 12న కర్ణాటక ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటకలో 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగిలిన రెండు నియోజక వర్గాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే నేడు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది.  ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌ భాజపా నువ్వా నేనా అన్న రీతిలో హోరాహోరీగా ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తొలి గంటలో రెండు పార్టీలు సమాన ఆధిక్యంలో కొనసాగగా.. రెండో గంటలో భాజపా స్వల్ప ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. బీజేపీ 93 స్థానాల్లో, కాంగ్రెస్ 88 స్థానాల్లో జేడీఎస్ 29 స్థానాల్లో, ఇతరులు ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.