బీజేపీ హవాలో ఉన్నా నాలుగోస్థానానికే... కారణం అదేనా..!


ఈసారి కూడా నటుడు సాయికుమార్ కు నిరాశే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నేడు కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో.. సాయికుమార్ నాలుగో స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వాల్సిందేనంటూ యడ్యూరప్ప ఇంటి ముందు తన అనుచరులతో ధర్నా నిర్వహించి, బాగేపల్లి టికెట్ పొందాడు సాయికుమార్. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది.  బాగేపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన   సుబ్బారెడ్డి ఆధిక్యంలో దూసుకుపోతుండగా, జేడీఎస్ అభ్యర్థి మనోహర్ అతనికి సమీపంలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థి శ్రీరామిరెడ్డి మూడో స్థానంలో ఉండగా, సాయికుమార్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... బీజేపీ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతున్న నేపథ్యంలో కూడా సాయి కుమార్ నాలుగో స్థానంలో ఉండటం. అంతేకాదు దీనికి కారణం కూడా తెలుపుతున్నారు. అక్కడ ఉన్న స్థానికుడికి టికెట్ ఇవ్వలేదన్న కోపంతోనే ఇక్కడి ప్రజల ఆగ్రహంతో ఉన్నారని.. అదే సాయికుమార్ పాలిట శాపమైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.