TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హెలికాప్టర్ లో సీఎం, కేంద్రమంత్రి... అరగంట పాటు గాల్లో చక్లర్లు.. 

Published on: Sat Dec 11, 2021 8:03AM

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ సహా 13 మంది చనిపోయిన ఘోర దుర్ఘటనను మరవకముందే కర్ణాటకలో మరో ఘటన అందరిని కలవరపెట్టింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అరగంటపాటు గాలిలో చక్కర్లు కొట్టడం అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. చివరికి సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

శాసనమండలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముఖ్యమంత్రి బొమ్మై శుక్రవారం బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో హుబ్బళ్లికి బయలుదేరారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఆయన వెంట ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హుబ్బళ్లికి చేరుకునే సరికి వాతావరణం సంక్లిష్టంగా మారింది. మంచు దట్టంగా కమ్ముకోవడంతో హెలీ ప్యాడ్ కనిపించలేదు. ఫలితంగా ల్యాండింగ్ సాధ్యం కాలేదు. దీంతో  మంగళూరు తరలించాలని భావించారు. ఈ క్రమంలో హెలికాప్టర్ అరగంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత వాతావరణం అనుకూలించడంతో హెలికాప్టర్ ల్యాండ్ అయింది. దీంతో అప్పటి వరకు ఉత్కంఠగా గడిపిన అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.