TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

సభలో నిద్రపోయిన సిద్ధరామయ్య...

Published on: Mon Apr 30, 2018 6:32PM

 

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి బుక్కయ్యారు. ఇప్పటికే పలుసార్లు సిద్ధరామయ్య నిద్రపోతూ కనపడి విమర్శలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి నిద్రపోయి బుక్కయ్యారు. గుల్బర్గాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొని సభలో కూర్చున్న ఆయన అలానే కూర్చీలో నిద్రపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆయన పక్కనున్న ఓ నేత సిద్ధరామయ్యను లేపాడు. కానీ, సిద్ధరామయ్య మళ్లీ నిద్రలోకి జారుకోవడం నవ్వులు పూయిస్తోంది. ఇంకేముంది ఈ వీడియో కాస్త...బయటకు రావడంతో నెటిజన్లు మరోసారి జోకులు వేసుకుంటున్నారు. సభ జరిగేటప్పుడు నిద్రనుంచి మేల్కోవడానికి సిద్ధరామయ్య చాలా ఇబ్బంది పడతారని అంటున్నారు. ఆయన కర్ణాటకలో ఐదేళ్లుగా ఇదే పని చేస్తున్నారని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మరి దీనికి సిద్దరామయ్య ఏం సమాధానం చెబుతారో చూడాలి.