TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిద్థూ మంత్రివర్గం నుంచి 14 మంది ఔట్..?

Published on: Sun Jun 19, 2016 5:36PM

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య..తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. ఇప్పటి వరకు తన కేబినెట్‌లో కొనసాగిన 14 మందిని తొలగించి వారి స్థానంలో కొత్తవారిని మంత్రులుగా తీసుకోవాలని సిద్ధూ భావిస్తున్నారు.  రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ మంత్రి, సినీ నటుడు అంబరీశ్ తదితరులు సీఎంకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడంతో వాటు అంబరీశ్ అభిమానులు కొన్ని చోట్ల ఆందోళనలు నిర్వహించారు.

 

దీనికి తోడు మంత్రివర్గంలో బెర్త్ గ్యారెంటీ అనుకున్న తరుణంలో పదవి దక్కకపోవడంతో అప్పట్లోనే చాలా అసమ్మతి సెగలు రేగాయి. తాజాగా తనకు మంత్రిపదవి ఇవ్వకుంటే పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని యాదగిరి ఎమ్మెల్యే మలకారెడ్డి ఢిల్లీలో హెచ్చరించారు. దీనిపై అధిష్టానం సూచనలు సలహాలు చేసేందుకు ఢిల్లీ వెళ్లిన సిద్దరామయ్య అధినేత్రి సహా ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. హైకమాండ్ ఆదేశాల మేరకు మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. నిన్న ఢిల్లీ నుంచి బెంగుళూరు వచ్చిన సిద్దూ హెచ్‌ఏఎల్ విమానాశ్రయం నుంచి ఆజ్ఞాత ప్రాంతానికి వెళ్లిపోయారు. దీంతో కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి.