సీరియల్ చూసి నిప్పంటించుకున్న పాప....


టీవీ సీరియల్ చూసి ఓ పాప నిప్పంటించుకుంది. ఈ దారుణమైన ఘటన కన్నడలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. క‌ర్ణాట‌క‌లోని దావణగిరి జిల్లాలో హ‌రిహ‌ర ప‌ట్ట‌ణంలో మంజునాథ్‌, చైత్ర‌లకు ఏడేళ్ల పాప ప్రార్థ‌న ఉంది. అయితే ప్రార్థ‌న టీవీలో ప్ర‌సార‌మ‌య్యే రెండు సీరియ‌ళ్ల‌ను చాలా ఇష్టంగా చూసేద‌ని.. వాటిలో ఒక సీరియ‌ల్‌లో పాప‌కి ఇష్ట‌మైన పాత్ర మంట‌ల్లో డ్యాన్స్ చేయ‌డం చూసి ప్రార్థ‌న ప్ర‌భావిత‌మైంద‌ని.. ఇంట్లో ఎవరూ లేని టైంలో ప్రార్దన కూడా నిప్పంటించుకుందని తెలిపారు. అయితే శరీరం తీవ్రంగా కాలడంతో పాప చనిపోయింది. తాము ఎన్నిసార్లు వారించిన‌ప్ప‌టికీ చైత్ర సీరియ‌ళ్లు చూడ‌టం మాన‌లేద‌ని, ద‌య‌చేసి త‌ల్లిదండ్రులు పిల్ల‌ల్ని సీరియ‌ల్స్ చూడ‌నివ్వ‌కండ‌ని ఆమె కోరింది.