TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

Published on: Fri Oct 31, 2025 3:53PM

 

కర్ణాటకలోని బెంగుళూరుకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్ట్ పై పోలీసుల కథనం.. అన్నమయ్య జిల్లా మదనపల్లె తాలూక పోలీస్ స్టేషన్ పరిధిలోని బెంగుళూరు రోడ్డు, బార్లపల్లి వద్ద శుక్రవారం వాహనాల తనిఖీచేస్తున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు. 

ఈ క్రమంలో రెండు బైకుల్లో సుమారు 22 కిలోల గంజాయి తరలిస్తూన్న బెంగళూరుకి చెందిన ఇర్ఫాన్(43), చిన్నమండెం కు చెందిన సయ్యద్ జాఫర్ వల్లి(54), మదనపల్లె కాలనీ గేటుకు చెందిన శివకుమార్ (22) లు పట్టుబడగా, నిందితుల వద్ద 22 కిలోల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.  అనంతరం వారిపై ఎన్ డి పి ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.