TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యడ్యూరప్పకు అధిష్టానం పిలుపు..ససేమిరా

Published on: Tue Mar 20, 2012 12:21PM

బెంగళూరు : కర్ణాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతునే ఉంది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మెట్టు దిగేది లేదని అధిష్టానానికి స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో తన అభ్యర్థిని బరిలోకి దింపిన ఆయన తాజాగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను బహిష్కరించారు. ఈ ఉదయం ప్రారంభమైన సమావేశాలకు యడ్యూరప్ప వర్గం ఎమ్మెల్యేలు ఎవరూ హాజరు కాలేదు. దాదాపు 70 మంది ఎమ్మెల్యేల సమావేశాలకు గైర్హాజరైనట్టు యెడ్డీ వర్గం ఎమ్మెల్యే బసవరాజ్‌ బొమ్మయ్‌ తెలిపారు. మరో వైపు యడ్యూరప్పను బుజ్జగించేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది. తక్షణం ఢిల్లీకి రావాలని ఆయనను కోరింది. అయితే యడ్యూరప్ప మాత్రం తాను ఢిల్లీకి వచ్చేది లేదని స్పష్టం చేశారు.