గాలి కోసం కర్ణాటక సిబిఐ పిటి వారెంట్
Published on: Wed Feb 29, 2012 9:20AM
హైద
రాబాద్: కర్ణాటకలో నమోదైన ఒక కేసుకు సంబంధించి ఓంఎసి యజమాని గాలి జనార్దన రెడ్డిని అక్కడి సిబిఐ విచారించనుంది. కర్ణాటక కోర్టులో జనార్దన రెడ్డి కోసం అక్కడి సిబిఐ పిటి వారెంట్ దాఖలు చేసింది. అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ కేసులో ఆయనని విచారించేదుకు ఈ వారెంట్ దాఖలైంది. జనార్దన రెడ్డిని విచారణ నిమిత్తం బెంగళూరు తీసుకువెళ్లే అవకాశం ఉంది. సిబిఐ ఈ విషయాన్ని చంచల్గూడ జైలు అధికారులకు తెలిపింది.


