గాలి బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా
Published on: Fri Dec 23, 2011 3:44PM
హైద
రాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి బెయిల్ పిటిషన్పై తీర్పును సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 28వ తేదికి వాయిదా వేసింది. గాలి బెయిల్ పిటిషన్ పైన శుక్రవారం ఇరువర్గాల వాదనలు పూర్తయ్యాయి. వాదనలు పూర్తైన అనంతరం తీర్పును వాయిదా వేసింది. అంతకుముందు సిబిఐ తరఫు న్యాయవాది, గాలికి బెయిల్ ఇస్తే సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని వాదించారు. అందుకు గాలి తరఫు న్యాయవాది, నిజంగా సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉంటే వారి సమీప పోలీసు స్టేషన్లలో ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. కేవలం సిబిఐకే ఎందుకు లేఖలు రాస్తున్నారన్నారు.


