ఏపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా..

ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ఇటు సామాన్యులను అటు ప్రజా ప్రతినిధులను కూడా కలవర పెడుతోంది. ఈ రోజు ఉదయం ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసిపి ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. కొద్దీ కాలంగా అనారోగ్యంగా ఉండటంతో ఒంగోలులోని రమేష్ సంఘమిత్ర ఆస్పత్రిలో రాంబాబు, ఆయన భార్య పరీక్షలు చేయించుకున్నారు. ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. ఐతే అయన కుటుంబ సభ్యులకు మాత్రం నెగిటివ్ వచ్చింది. 

ఐతే తాజాగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన బంజారాహిల్స్ స్టార్ హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. దీంతో అయన కుటుంబ సభ్యులతోపాటు ప్రైమరీ కాంటాక్టులను కూడా పిలిపించి అందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇంతకు ముందు సామాన్యులకు ఎక్కువగా కరోనా సోకేది. ఐతే ఎపుడు సెక్యూరిటీ మధ్య ఉండే ప్రజా ప్రతినిధులకు కూడా కరోనా సోకుతోంది. దీంతో ఈ ఎమ్మెల్యేలను ఈ మధ్య కలిసిన వారిని కూడా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సూచిస్తున్నారు.