TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తోక ముడుస్తున్న కాపు రామచంద్రారెడ్డి?

Published on: Wed Mar 7, 2012 10:29AM

అనంతపురం: అనంతపురం జిల్లా రాయదుర్గం జగన్ వర్గ ఎమ్మెల్యేపై ఇటీవల వేటుపడిన విషయం విదితమే. వేటుకు గురైన అభ్యర్ధులందరికీ తిరిగి టిక్కెట్లు ఇస్తామని జగన్ ఒకవైపు భరోసా ఇచ్చారు. అయితే మీరు టిక్కెట్ ఇచ్చినా నేనూ పోటీ చేయను అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. దీనికి ప్రధాన కారణం నియోజకవర్గంలో జగన్ వర్గానికి ప్రతికూల పరిస్థితులు ఉండటమేనని తెలుస్తోంది. అందుకే పార్టీ టిక్కెట్ ఇచ్చినా తిరిగి పోటీ చేయకూడదన్న భావనతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ తీరు తెన్నులపైనా సహనాయకుల సహాయ నిరాకరణ పట్ల ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారు. ఇదే అసంతృప్తిని ఆయన పలుమార్లు బహిరంగంగానే వెళ్ళగక్కారు. తన తరపున వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎన్నికల్లో నిలపాలని ఆయన జగన్ కు సలహా ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో ఈ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఎవరనే విషయంపై సందిగ్ధత ఏర్పడింది.