ఏపీలో కలెక్టరేట్ల ముట్టడి..
Published on: Thu Feb 4, 2016 9:57AM
.jpg)
ఆంధ్ర రాష్ట్రంలో నేడు బీసీ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి జరగనుంది. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాల్లో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు కాపులను బీసీల్లో చేర్చాలని.. కాపు రిజర్వేషన్లపై సాయంత్రలోగా నిర్ణయం తీసుకోవాలని లేకపోతే రేపటి నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ముద్రగడ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈరోజు కాపు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ కానున్నారు. ఈ సందర్బంగా ఆయన కమిషన్ విధివిధానాలు, జిల్లా పర్యటనపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.


