కాపు ఐక్య గర్జన.. 144 సెక్షన్
Published on: Mon Feb 1, 2016 9:33AM
.jpg)
కాపులను కూడా బీసీ వర్గాల్లోకి చేర్చాలని.. వారికి కూడా రిజర్వేషన్ కల్పించాలనే ముద్రగడ పద్మనాభం 'కాపు ఐక్య గర్జన' పేరుతో ఉద్యమానికి తెర లేపారు. అయితే ఇప్పుడు ఈ ఉద్యమం ఉద్రిక్తత పరిస్థితికి చేరుకున్నట్టు తెలుస్తోంది. కాపులను బీసీల్లోకి చేరుస్తున్నట్టు సాయంత్రంలోగా నిర్ణయం తీసుకోవాలని ముద్రగడ అల్టిమేటం జారీచేశారు. మరోవైపు కార్యకర్తలు ఆందోళనలు ఎక్కువవడంతో తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడ, అమరావతి తదితర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. దాదాపు 3000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.


