సీఎం కేజ్రీవాల్ పై హైకోర్టులో పిటిషన్

 

అధికార పార్టీ నేతని ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శించటం, ఇరుకున పెట్టాలని చూడటం కామన్.. కానీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది.. సొంత పార్టీ నేత కపిల్ మిశ్రా, కేజ్రీవాల్ ని విమర్శించడం, ఆయన్ని ఇరుకున పెట్టాలని చూడటం చేస్తుంటాడు.. అప్పట్లో, కేజ్రీవాల్ అవినీతి చేశాడంటూ ఆరోపించి మంత్రిపదవి పోగొట్టుకున్న కపిల్ మిశ్రా..ఇప్పుడు, కేజ్రీవాల్ పై హైకోర్టులో పిటిషన్ వేసి మరో షాకిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.. సీఎం కేజ్రీవాల్, అసెంబ్లీకి 10 శాతం కూడా హాజరుకాలేదని.. ఆయన జీతంలో కోత విధించాలని పిటిషన్లో పేర్కొన్నాడు.. మరి దీనికి హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి...