కేశినేని చిన్నికి కంఠంనేని రవిశంకర్ అభినందనలు!
Published on: Sat Jun 15, 2024 8:32PM
విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా భారీ విజయం సాధించిన కేశినేని చిన్ని (కేశినేని శివనాథ్)ని ‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి సంచలన విజయం సాధించిన కేశినేని చిన్నిని కంఠంనేని ఈ సందర్భంగా అభినందించారు. కేశినేని చిన్ని సారథ్యంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం మరింత అభివృద్ధిని సాధిస్తుందన్న ఆకాంక్షను కంఠంనేని రవిశంకర్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.


