TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ రెండు బిల్లులను పక్కన పెట్టండి.. గవర్నర్ కు కన్నా లేఖ

Published on: Sat Jul 18, 2020 6:14PM

ఎలాగైనా మూడు రాజధానుల బిల్లు, సిఆర్డీఏ సవరణ బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ఏపీ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తున్న సంగతి తెల్సిందే. దీని కోసం ఆ బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లులు రాజ్యాంగ వ్యతిరేకమని ఎపి విభజన బిల్లుకు కూడా వ్యతిరేకమని ప్రతి పక్షాలు మొత్తుకుంటున్నాయి. తాజాగా ఎపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఒక లేఖ రాసారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలు ఆమోదించడం లేదని, ప్రభుత్వం పంపిన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ సవరణ బిల్లులను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆమోదించవద్దని అయన కోరారు. దీనికి కారణాలను వివరిస్తూ.. ఒక పక్క సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే, మరో పక్క రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉందని వివరించారు. ఈ బిల్లులపై ఇటు ప్రజల, అటు రైతుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని అయన గవర్నర్ ను కోరారు. ఈ సందర్బంగా రాజధాని ప్రాంత ప్రజల శాంతియుత నిరసనలను కూడా పరిశీలించాలని అయన ఆ లేఖలో తెలిపారు.

ఇపుడు కన్నా రాసిన ఈ లేఖతో ఏపీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే రాష్ట్ర గవర్నర్ ను కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం నియమించడంతో అయన బీజేపీ మాట కాదనే అవకాశం ఉండదు. దీంతో అమరావతి పై బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్ లో ఈ లేఖ ఒక భాగమా లేక ఈ విషయం పై ఆ పార్టీ సీరియస్ గానే ఉందా అనే సంగతి త్వరలోనే తేలుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.