ఏపీకి ప్రత్యేకహోదా అంశం బీజేపీ పూర్తిగా మరిచిందా?

2014 ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామన్న బీజేపీ, తరువాత ప్రత్యేక ప్యాకేజీ అని మాట మార్చింది.. టీడీపీ కూడా మొదట్లో ప్యాకేజీకి అంగీకరించింది.. కానీ తరువాత ప్యాకేజీకి కూడా మొండిచెయ్యి చూపుతున్నారని భావించి ప్రత్యేకహోదాకి పట్టుపట్టింది.. ఏపీ ప్రజలు, ప్రభుత్వం ప్రత్యేకహోదాని బలంగా కోరుతున్న సమయంలో.. బీజేపీ చేసిన ఒక పనికి అందరూ షాక్ అవుతున్నారు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ప్రధాని మోడీని కలిశారు.. కేంద్రం ఏపీకి అమలు చేయాల్సిన 12 అంశాల జాబితాను మోడీకి ఇచ్చానని చెప్పిన కన్నా, ఆ జాబితాని మీడియాకి విడుదల చేసారు.. విచిత్రం ఏంటంటే ఆ జాబితాలో ప్రత్యేకహోదా అంశం లేదు.. చూస్తుంటే బీజేపీ, ఏపీకి ప్రత్యేకహోదా అంశం పూర్తిగా మర్చిపోయినట్టుంది అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.. చూద్దాం, కన్నా జాబితాలో ప్రత్యేకహోదా అంశం మరిచారో? లేక అసలు బీజేపీనే ప్రత్యేకహోదా అంశం మరిచిందో? అంతా ఆ తిరుపతి వెంకన్నకే తెలియాలి.