TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రామోజీతో కన్నా భేటీ.. టీడీపీతో రాజీ కోసమేనా?

Published on: Thu Jun 7, 2018 1:30PM

 

రామోజీ రావు .. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు.. ఈనాడు సంస్థల అధినేతగా ప్రజలకు దగ్గరైన రామోజీ.. రాజకీయాలకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు.. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది రాజకీయ ప్రముఖులు ఆయన్ని కలుస్తుంటారు.. ఎంతమంది కలిసినా, ఎవరేం అనుకున్నా ఆయన తెలుగుదేశానికి మద్దతుగా నిలుస్తారని అందరికి తెలిసిందే..

మొన్నటి వరకు మిత్రులుగా ఉన్న బీజేపీ, టీడీపీ.. ఇప్పుడు విడిపోయి ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నసంగతి తెలిసిందే.. ఈ టైంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, రామోజీతో భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది.. రామోజీకి, కన్నాతో అంతగా సాన్నిహిత్యం లేదు.. అయినా కన్నా ఇలా సడెన్ గా రామోజీతో భేటీ అవ్వడంతో.. టీడీపీ తో రాజీ కుదుర్చుకోడానికి, బీజేపీ పంపిన రాయభారం అయ్యుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు..

ఈ మధ్య బీజేపీ నేతలు టీడీపీ మీద, చంద్రబాబు మీద ఆరోపణలు, విమర్శలు బాగా చేస్తున్నారు.. దీనికి జవాబుగా కేంద్రం చేసిన రెండు భారీ స్కాములను సాక్షాలతో సహా బయట పెడతామంటూ టీడీపీ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే.. ఇదే కన్నా, రామోజీల భేటీకి పునాది వేసింది అంటున్నారు.. ఈ టైంలో స్కాములు బయటపడితే బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది.. అందుకే బీజేపీ పెద్దలు టీడీపీ తో సత్సంబంధాలున్నా రామోజీతో, కన్నాని భేటీకి పంపారంట.. ఇదంతా చూస్తుంటే స్కాముల బాంబు బీజేపీకి గట్టిగానే తగిలినట్టు కనిపిస్తుంది...